Breaking News

ఆసీస్‌పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్‌

Published on Wed, 10/01/2025 - 17:43

కాన్పూర్ వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఇండియా-ఎ జ‌ట్టు బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త‌-ఎ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 413 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను ఉతికారేశారు. కాన్పూర్‌ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఆర్య 84 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేయగా.. అయ్యర్‌ 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. 

వీరిద్దరితో పాటు ప్రభ్‌ సిమ్రాన్‌ సింగ్‌(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రియాన్‌ పరాగ్‌(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్‌ బౌలర్లలో విల్‌ సదర్లాండ్‌ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్‌, స్టార్కర్‌ తలా వికెట్‌ సాధించారు. 

ఈ మ్యాచ్‌లోభారత ఓపెనర్లు  ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ఆర్య తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఈ నెలలో భారత సీనియర్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో భారత్‌ ఆసీస్‌తో తలపడనుంది.
చదవం‍డి: ఆసీస్‌పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్‌ ఆర్య.. తొలి మ్యాచ్‌లోనే..!

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)