వారిద్దరూ అద్భుతం.. గతం మాకు అవసరం లేదు: శ్రేయస్‌ అయ్యర్‌

Published on Sat, 07/25/2026 - 21:22

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 

తొలుత బ్యాటింగ్‌లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు.

"ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిష‌న్‌, తిల‌క్ వ‌ర్మ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. వారిద్ద‌రూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. 

ఈ పిచ్‌పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ త‌ర్వాత మా బౌల‌ర్లు వారి ప‌ని వారు చేసుకుపోయారు. స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును 129 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. 

మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జ‌ట్టుపై ఆధిప‌త్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్‌లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం. 

ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)