Breaking News

కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్‌ అయ్యర్‌! స్టంప్స్‌ ఎగిరిపోయాయిగా

Published on Sun, 03/03/2024 - 13:32

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్‌, టీమిండియా మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ తన తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ సెకెండ్‌ సెమీఫైనల్లో క్రికెట్ అకాడమీ వేదికగా ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్‌ సాయికిషోర్‌ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. అంతకుముందు తమిళనాడు సైతం తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైంది. కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. 

బీసీసీఐ సీరియస్‌.. అయ్యర్‌ రీ ఎంట్రీ
వాస్తవానికి అయ్యర్‌ బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముంబై జట్టుకు అందుబాటులో ఉండాల్సింది. కానీ వెన్ను నొప్పి సాకు చెప్పి క్వార్టర్స్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ శ్రేయస్‌ను ఏకంగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. బీసీసీఐ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు దిగిచ్చొన అయ్యర్‌ సెమీఫైనల్స్‌కు అందుబాటులోకి వచ్చాడు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)