Breaking News

మంచి మనసు చాటుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 08/17/2023 - 08:02

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న అయ్యర్‌.. బుధవారం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న సమయంలో ఓ తండ్రి చిన్నారితో సహా అయ్యర్‌ వద్దకు వెళ్లి సాయం కోరాడు. అయ్యర్‌ వెంటనే ఆ వ్యక్తిను చూసి నవ్వి  జేబులో నుంచి కొంత డబ్బును వారికి ఇచ్చాడు.

అదే విధంగా పక్కన మరో వ్యక్తికి కూడా శ్రేయస్‌ సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మా అయ్యర్‌.. మనసున్న మారాజు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆసియాకప్‌తో రీ ఎంట్రీ..
వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. అయ్యర్‌ ఏన్సీఏలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా శ్రేయస్‌ మొదలు పెట్టాడు.

దీంతో అతడు ఆసియాకప్‌-2023తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అతడితో పాటు మరో స్టార్‌ బ్యాటర్‌  కేఎల్‌ రాహుల్‌ కూడా పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే ఛాన్స్‌ ఉంది.
చదవండి: నెమార్‌కు బంపరాఫర్‌.. ఏకంగా 832 కోట్లు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)