Breaking News

చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌..

Published on Tue, 05/27/2025 - 07:44

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టింది. జైపూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పంజాబ్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానాన్ని కైవ‌సం చేసుకోంది.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్‌, యాన్సెన్, వైశాక్‌ తలా 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. జోష్‌ ఇన్‌గ్లిస్‌ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు),  ప్రియాన్ష్‌ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌల‌ర్ల‌లో సాంట్నర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బుమ్రా ఒక్క వికెట్ సాధించారు. ఈ విజ‌యంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చ‌రిత్ర సృష్టించిన శ్రేయస్‌..
ఐపీఎల్ చరిత్రలో మూడు వెర్వేరు జట్లును క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్‌ కెరీర్‌ను ప్రారంభించిన శ్రేయస్‌.. 2020 సీజన్‌లో ఢిల్లీ జట్టును కెప్టెన్‌గా రెండవ స్ధానానికి చేర్చాడు.

సెకెండ్ క్వాలిఫయర్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్‌-2024 పాయింట్ల పట్టికలో శ్రేయస్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్దానంలో నిలిచింది. ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తు చేసి మూడో ఐపీఎల్ టైటిల్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్‌ను క్వాలిఫయర్స్‌కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
చదవండి: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్‌
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)