Breaking News

భయమనేది లేదు.. అతడొక అత్యద్భుతం: శ్రేయస్‌ అయ్యర్‌

Published on Thu, 07/23/2026 - 21:31

టీ20ల్లో టీమిండియా ఎట్ట‌కేల‌కు తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆతిథ్య జ‌ట్టు నిర్ధేశించిన 126 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి కేవ‌లం 13.2 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది.

యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ కేవ‌లం 19 బంతుల్లో 50 ప‌రుగులు సాధించి భార‌త త‌ర‌పున టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్‌బ్యాక్ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. త‌న కెప్టెన్సీలో జ‌ట్టు తొలి విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉంద‌ని అయ్య‌ర్ అన్నాడు.

"ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్‌గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.

అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాద‌వ్ సంచ‌ల‌న స్పెల్ బౌలింగ్ చేశాడు. స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ అసాధ‌ర‌ణ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డికి ఏ మాత్రం భ‌యం లేదు. 

వైభవ్‌ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్య‌ద్భుతం. హరారే పిచ్‌పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్‌లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్‌లో అత‌డికి ప‌నికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్‌ల‌లో కూడా ఇదే జోరును కొన‌సాగించి సిరీస్ క్లీన్‌ చేస్తామ‌ని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో శ్రేయ‌స్ పేర్కొన్నాడు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)