ఇదేంటి అయ్య‌ర్‌.. స‌హ‌చ‌ర ఆట‌గాడిని అలా తిడ‌తావా? వీడియో వైరల్‌

Published on Mon, 06/02/2025 - 14:05

తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు పంజాబ్ కింగ్స్ అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ముంబై ఇండియ‌న్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్‌.. 11 ఏళ్ల త‌ర్వాత తుది పోరుకు ఆర్హ‌త సాధించింది. ఈ విజ‌యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర‌. 204 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో అయ్య‌ర్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 

సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శ్రేయ‌స్‌.. ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అయ్య‌ర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 87 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఎప్పుడూ ప్ర‌శాంతంగా క‌న్పించే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఈ మ్యాచ్‌లో త‌న సహ‌నాన్ని కోల్పోయాడు. 

త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు శశాంక్ సింగ్‌ను ఆస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించాడు. మ్యాచ్ అనంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న టీమ్ మేట్స్‌కు, ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు క‌ర‌చాల‌నం చేస్తూ ముందుకు సాగాడు. ఈ క్ర‌మంలో శ‌శాంక్ సింగ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాక‌రించాడు. అంతేకాకుండా పరుష పదజాలం వాడి అత‌డిని తిట్టాడు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అయితే శ్రేయ‌స్ కోపానికి వెన‌క ఓ కార‌ణం ఉంది.

అస‌లేమి జ‌రిగిదంటే?
నేహాల్ వ‌ధేరా ఔట‌య్యాక శ‌శాంక్ సింగ్ క్రీజులోకి వ‌చ్చాడు. అయితే కీల‌క స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శ‌శాంక్ కేవ‌లం మూడు బంతులు మాత్రమే ఆడి రనౌట‌య్యాడు. 17వ ఓవ‌ర్‌లో శ‌శాంక్ (2) మిడ్ ఆన్ దిశ‌గా షాట్ ఆడాడు. ర‌న్ కోసం పరిగెత్తాడు.  ఈ క్ర‌మంలో అక్క‌డే ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో స్టంప్స్‌ను గిరాటేశాడు. థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేయ‌గా రిప్లేలో శశాంక్ బ్యాట్ క్రీజుకు వెలుపుల ఉన్న‌ట్లు క‌న్పించింది.

దీంతో థ‌ర్డ్ అంపైర్ ఔట్‌గా ప్ర‌క‌టించాడు. అయితే శ‌శాంక్ నిర్ల‌క్ష్యంగా ప‌రిగెత్త‌డంతోనే ఔట‌య్యాడు. క‌నీసం డైవ్ చేసి ఉన్నా ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి ఈ పంజాబ్ ఆట‌గాడు త‌ప్పించుకుని ఉండేవాడు. కీల‌కమైన స‌మ‌యంలో శ‌శాంక్ నిర్ల‌క్ష్యంగా ర‌నౌట్ కావ‌డమే అయ్య‌ర్ అగ్ర‌హానికి కార‌ణ‌మైంది.
చదవండి: IPL 2025: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)