Breaking News

ఎందుకంత ఓవరాక్షన్‌ బాబు.. నీకు రోహిత్‌ చేతిలో ఉందిలా! వీడియో వైరల్‌

Published on Fri, 03/08/2024 - 09:06

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో జైశ్వాల్‌ చెలరేగాడు.  కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఓవరాక్షన్‌ చేశాడు. 

ఏమి జరిగిందంటే?
తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. స్పిన్నర్‌ బషీర్‌ను ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బషీర్‌కు తన తొలి ఓవర్‌లోనే జైశ్వాల్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసిన బషీర్‌ బౌలింగ్‌లో యశస్వీ మూడు సిక్స్‌లు బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అంతటితో ఆగకుండా తర్వాతి ఓవర్లలో కూడా బషీర్‌ను జైశ్వాల్‌ టార్గెట్‌ చేశాడు.

అయితే దురదృష్టవశాత్తూ బషీర్‌ బౌలింగ్‌లోనే జైశ్వాల్‌ ఔటయ్యాడు. 20 ఓవర్‌ వేసిన బషీర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన జైశ్వాల్‌ తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో కాస్త విఫలమైన యశస్వీ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బషీర్‌ సెలబ్రేషన్స్‌ శృతిమించాయి. జైశ్వాల్‌ వైపు కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ సీరియస్‌గా ఎదో అన్నాడు.

జైశ్వాల్‌ మాత్రం అతడిని పట్టించుకోకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. కానీ నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం ఎందుకు అంత ఓవరాక్షన్‌ అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు అరే బషీర్ నీకు మా రోహిత్‌ చేతిలో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)