Breaking News

'అతడు కోచ్‌గా పనికిరాడు.. చెత్త కెప్టెన్సీ కూడా'.. పాక్‌ టీమ్‌పై అక్తర్‌ ఫైర్‌

Published on Tue, 09/30/2025 - 17:45

ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటేలా కన్పించినప్పటికి భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 

ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(69) అద్భుతపోరాటంతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌పై విమ‌ర్శ‌లు గుప్పించాడు. జట్టు ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయ‌ని, యువ ఆట‌గాళ్ల‌కు స‌రైన అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని అక్త‌ర్ మండిప‌డ్డాడు.

"టీమ్ మెనెజ్‌మెంట్ స‌రైన వ్యూహాలను రచించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. సెన్స్‌లెస్ కోచింగ్‌. హెడ్ కోచ్ ఏమి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడో నాకు ఆర్ధం కావ‌డం లేదు. అత‌డు కోచ్‌గా ప‌నికిరాడు. ఇలా క‌ఠినంగా మాట‌లు ఆడుతున్నందుకు క్షమించండి. జ‌ట్టు సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు. 

యువ ఆట‌గాడు హ‌స‌న్ న‌వాజ్‌ను మ‌ళ్లీ బెంచ్‌కే ప‌రిమితం చేశారు. అత‌డొక మ్యాచ్ విన్న‌ర్‌. అయినా అత‌డిని ఆడించ‌డం లేదు. అంతేకాకుండా పేస‌ర్ సల్మాన్ మీర్జా ఓ అవ‌కాశమివ్వాల్సింది. ఒక్క మ్యాచ్‌లో కూడా అత‌డిని ఆడించ‌లేదు. ఈ ఓట‌మి మ‌మ్మ‌ల్ని చాలా బాధించింది. 

దేశం మొత్తం గెలుపు కోసం ఎదురు చూసింది. కానీ మ‌రోసారి మ‌మ్మ‌ల్ని నిరాశ‌ప‌రిచారు. మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్ క‌ష్టాలు ఇప్ప‌టికి కొన‌సాగుతున్నాయి. అంద‌రికి ఆ విష‌యం తెలుసు. కానీ అందుకు ప‌రిష్కారం మాత్రం మెనెజ్‌మెంట్ వెత‌క‌డం లేదు.

మిడిలార్డ‌ర్‌లో మొహమ్మద్ నవాజ్‌పై ఎక్కువ‌గా ఆధారప‌డుతున్నారు. అంతేకాకుండా లోయార్డ‌ర్‌లో బ్యాట‌ర్లు క‌నీసం  50 పరుగులు జోడించాల‌ని ఆశిస్తున్నారు. కొన్ని సార్లు షాహీన్ అఫ్రిదిని  ఫహీమ్ అష్రఫ్ కంటే ముందు బ్యాటింగ్ పంపుతున్నారు. ఆఖరిలో వారు రాణిచండం వల్లే 175 పరుగులకు చేరుకోగల్గుతున్నారు. ఏదేమైనప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది.

సల్మాన్ కెప్టెన్సీ కూడా బాగోలేదు. బౌలింగ్‌ మార్పులు చేయడంలో అతడు విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు.. హారిస్ రౌఫ్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అత‌డు ఒకే ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌ను ట‌ర్న్ చేసింది. పాక్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని తప్మాడ్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ పేర్కొన్నాడు.
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు