Breaking News

పాకిస్తాన్‌ను వర్షం కాపాడింది.. బాబర్‌ తెలివి తక్కువ పనిచేశాడు: అక్తర్‌

Published on Mon, 09/11/2023 - 12:26

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో పాకిస్తాన్‌ బౌలర్లకు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు. లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌పై విఫలమైన రోహిత్‌ శర్మ, గిల్‌.. ప్రధాన దశలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదిని రోహిత్‌, గిల్‌ చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రోహిత్‌(56), గిల్‌(58) పరుగులతో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ జట్టు బాధ్యతను తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అందరూ ఊహించిన అతిథి వచ్చేశాడు. అదేనండి వరుణుడు. భారీ స్కోర్‌దిశగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌ జోరుకు వర్షం కళ్లెం వేసింది.

భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రిజర్వ్‌ డే అయిన సోమవారంకు అంపైర్‌లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను వర్షం కాపాడిందని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.

'నేను భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూడటానికి ఇక్కడకు వచ్చాను. నాతో పాటు ఇరు దేశాల అభిమానులు మ్యాచ్‌ ప్రారంభం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మా జట్టును వర్షం కాపాడిందనిఅనుకోవాలి.

అంతకుముందు లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ను వర్షం రక్షించింది. కానీ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బాబర్‌ బౌలింగ్‌ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అది తెలివైన నిర్ణయం కాదు" అని సోషల్‌ మీడియాలో ఓ వీడియోను అక్తర్‌ పోస్ట్‌ చేశాడు.
చదవండి: Asia Cup 2023: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు