'నాకు నచ్చలేదు.. బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నా' 

Published on Sun, 01/22/2023 - 08:47

'రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌' అనగానే మదిలో మెదిలే బౌలర్‌ పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌' పేరుతో బయోపిక్‌ రూపొందించాలని ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్‌ ఫర్హాజ్‌ ఖాసిర్‌ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్‌ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్‌ అక్తర్‌ శనివారం రాత్రి ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు.

ప్రొడక్షన్‌ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్‌ రూపొందిస్తే లీగల్‌ యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు.

''రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ బయోపిక్‌ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్‌ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్‌మెంట్‌, లీగల్‌ టీమ్‌ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం​ లీగల్‌గా యాక్షన్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక పాకిస్తాన్‌ క్రికెట​లో తన ఆటతో అక్తర్‌ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అక్తర్‌ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్‌ పాకిస్తాన్‌ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్‌ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది.

చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)