Breaking News

శిఖర్‌ ధవన్‌ సుడిగాలి శతకం

Published on Tue, 12/17/2024 - 18:30

బిగ్‌ క్రికెట్‌ లీగ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ ఛార్జర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధవన్‌.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్‌.. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. 

ధవన్‌కు జతగా మరో ఎండ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్‌-షెన్వారీ జోడీ తొలి వికెట్‌కు 207 పరుగులు జోడించింది. ధనవ్‌, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.

పరుగుల వరద పారిస్తున్న ధవన్‌
బిగ్‌ క్రికెట్‌ లీగ్‌లో శిఖర్‌ ధవన్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ధవన్‌ 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో ధవన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైనా కూడా ధవన్‌లో జోరు ఏమాత్రం​ తగ్గలేదు. రిటైర్మెంట్‌ అనంతరం ధవన్‌ ప్రతి చోటా లీగ్‌లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్‌ క్రికెట్‌ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. ధవన్‌ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అభిమానులను అలరించాడు.

 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)