Breaking News

మొన్న పుజారా.. నిన్న శిఖర్‌ ధవన్‌

Published on Tue, 02/03/2026 - 11:06

టీమిండియా తాజా మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, ఛతేశ్వర్‌ పుజారా లేటు వయసులోనూ చెలరేగిపోతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లు ముగిసాక కూడా వీరిద్దరూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్‌ క్రికెటర్లతో కలిసి వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌లో ఆడుతున్న ధవన్‌, పుజారా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో తృటిలో సెంచరీలను కోల్పోయారు. 

ఈ టోర్నీలో గుర్‌గ్రామ్‌ థండర్‌కు ఆడుతున్న పుజారా దుబాయ్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. నిన్న మహారాష్ట్ర టైకూన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుయాబ్‌ రాయల్స్‌ తరఫున శిఖర్‌ ధవన్‌ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ధవన్‌, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్‌ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.

కాగా, వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.

జనవరి 26న మొదలై పది రోజుల పాటు సాగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ మోర్గాన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.

గోవా వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ లయన్స్‌, కీరన్‌ పోలార్డ్‌ నేతృత్వంలోని పూణే పాంథర్స్‌, గుర్‌కీరత్‌ సింగ్‌ మాన్‌ కెప్టెన్సీలోని ఢిల్లీ వారియర్స్‌, శిఖర్‌ ధనవ్‌ నేతృత్వంలోని దుబాయ్‌ రాయల్స్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. 

ఇవాళే (ఫిబ్రవరి 3) ఈ సెమీస్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి సెమీస్‌లో రాజస్థాన్‌, పూణే.. రెండో సెమీస్‌లో ఢిల్లీ, దుబాయ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌ మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండో సెమీస్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి