Breaking News

సూర్యకుమార్‌ కాదు, కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌

Published on Fri, 11/21/2025 - 21:17

నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కాబోయే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT 2025-26) కోసం​ 17 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (నవంబర్‌ 21) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) ఎంపికయ్యాడు. 

ఇవాళ ఉదయం నుంచి సోషల్‌మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేసింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya kumar Yadav) ఎంపికయ్యాడని జోరుగా ప్రచారం​ జరిగింది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారిక ప్రకటనతో ఈ వార్త అబద్దం అని తేలిపోయింది. 

అయితే సూర్యకుమార్‌ సాధారణ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో అతను కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. SMAT సౌతాఫ్రికా సిరీస్‌ షెడ్యూల్స్‌ క్లాష్‌ అవుతున్నాయి.

శార్దూల్‌ ఇటీవలే ముంబై రంజీ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వెటరన్‌ అజింక్య రహానే నుంచి బాధ్యతలు చేపట్టాడు. వాస్తవానికి SMATలో ముంబై జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండింది. అయితే అతను ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడటంతో అందుబాటులో లేకుండా పోయాడు.

ఈ నేపథ్యంలో శార్దూల్‌కు కెప్టెన్సీ హోదా దక్కింది. రానున్న SMAT ఎడిషన్‌లో ముంబై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. గత ఎడిషన్‌ ఫైనల్లో శ్రేయస్‌ నేతృత్వంలోని ముంబై జట్టు మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

రానున్న సీజన్‌ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో చాలామంది టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్‌ శార్దూల్‌, భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు టీ20 స్టార్ శివమ్‌ దూబే, వెటరన్‌ అజింక్య రహానే, యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, అప్‌కమింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ మాత్రే ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా అండర్‌-19 స్టార్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఎంపికయ్యాడు.

ఈ టోర్నీలో ముంబై ప్రయాణం నవంబర్‌ 26న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుంది.

SMAT 2025-26 కోసం ముంబై జట్టు: 
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్‌), అజింక్య రహానే, ఆయుశ్‌ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, తనుష్ కోటియన్, షమ్స్ ములానీ, తుషార్‌ దేశ్‌పాండే, ఇర్ఫాన్‌ ఉమైర్‌, హార్దిక్‌ తామోర్‌ (వికెట్‌కీపర్‌)

చదవండి: వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)