‘అగార్కర్‌, గంభీర్‌లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!

Published on Mon, 10/20/2025 - 13:30

టీమిండియా మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్‌ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్‌కు చురకలు అంటించాడు.

అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్‌ షమీని కాదని హర్షిత్‌ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.

ఏడు వికెట్ల తేడాతో ఓటమి
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో గిల్‌ సేన ఆసీస్‌ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో  డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.

అగార్కర్‌, గంభీర్‌లను తొలగిస్తేనే సరి?
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు.. గంభీర్‌, అగార్కర్‌లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ దర్శనమిచ్చింది. జాడ్‌ ఇన్సానే అనే అకౌంట్‌ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్‌ అగార్కర్‌, గౌతం గంభీర్‌లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.

అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్‌ల ఫొటోలను కూడా సదరు నెటిజన్‌ జతచేశారు.

సిగ్గు పడండి
ఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్‌ కొనసాగుతుంది.

చదవండి: నితీశ్‌ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)