Breaking News

ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ వన్డే జట్టు.. రోహిత్‌కు నో ప్లేస్‌

Published on Wed, 08/28/2024 - 08:35

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ వన్డే జట్టు వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్‌ ధోనిని నియమించాడు. జట్టులో రెండో ఆల్‌రౌండర్‌గా తన ప్లేస్‌ను ఫిక్స్‌ చేసుకున్నాడు. తన ఫేవరెట్‌ జట్టులో వన్డే క్రికెట్‌లోని స్టార్లందరికీ చోటు కల్పించిన షకీబ్‌.. ఒక్క రోహిత్‌ శర్మను మాత్రం పక్కన పెట్టాడు. షకీబ్‌ తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ జట్టులోకి రోహిత్‌ను తీసుకోలేదు. 

ఓపెనర్లుగా సచిన్‌ టెండూల్కర్‌, సయీద్‌ అన్వర్‌లకు అవకాశం ఇచ్చిన షకీబ్‌.. వన్‌డౌన్‌లో ఆశ్చర్యకరంగా క్రిస్‌ గేల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. నాలుగో స్థానం కోసం విరాట్‌ను ఎంపిక చేసిన షకీబ్‌.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా జాక్‌ కల్లిస్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. ఆరో స్థానం కోసం ధోని ఎంపిక చేసిన షకీబ్‌.. ఏడో స్థానంలో తనను తాను ప్రమోట్‌ చేసుకున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా షేన్‌ వార్న్‌, ముత్తయ్య మురళీథరన్‌లను ఎంపిక చేసిన షకీబ్‌.. ఫాస్ట్‌ బౌలర్లుగా వసీం అక్రమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లకు ఛాన్స్‌ ఇచ్చాడు.

కాగా, కెరీర్‌ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న షకీబ్‌.. స్వదేశంలో జరిగిన ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. షకీబ్‌పై బంగ్లాదేశ్‌లో మర్డర్‌ కేసు నమోదైంది. ఈ కేసులో షకీబ్‌ 28వ నిందితుడిగా ఉన్నాడు. షకీబ్‌ విషయంలో బాధితుడి తరఫు లాయర్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బీసీబీ మాత్రం పట్టీపట్టనట్లు ఉంది. 

షకీబ్‌పై నేరం రుజువైతే అప్పుడు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అప్పటివరకు అతను జట్టుతో కొనసాగుతాడని పేర్కొంది. షకీబ్‌ తాజాగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌ సాధించిన చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షకీబ్‌పై ఎన్ని వివాదాలు ఉన్నా ఆట పరంగా అతను బంగ్లాదేశ్‌కు లభించిన ఆణిముత్యమనే చెప్పాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)