Breaking News

చ‌రిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్‌..

Published on Mon, 08/25/2025 - 08:59

టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో  500 వికెట్ల మైలు రాయిని అందుకున్న 5వ క్రికెటర్‌గా షకీబ్ రికార్డులకెక్కాడు.  కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్‌.. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

సెయింట్స్ కిట్స్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేసిన అనంతరం షకీబ్ అల్ హసన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంగ్లా మాజీ కెప్టెన్ ఇప్పటివరకు 457 మ్యాచ్‌లు ఆడి 502 వికెట్లు పడగొట్టాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (658 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. అదేవిధంగా షకీబ్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 7000 పరుగులతో పాటు  500 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా షకీబ్ నిలిచాడు.

ఈ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ అక్టోబర్ 2024 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో మాత్రమే పాల్గొంటున్నాడు. 

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..
రషీద్ ఖాన్- 487 మ్యాచ్‌లు- 660 వికెట్లు
డ్వైన్ బ్రావో- 582 మ్యాచ్‌లు- 631 వికెట్లు
సునీల్ నరైన్- 557 మ్యాచ్‌లు- 590 వికెట్లు
ఇమ్రాన్ తాహిర్- 436 మ్యాచ్‌లు- 554 వికెట్లు
షకీబ్ అల్ హసన్- 457 మ్యాచ్‌లు-502 వికెట్లు
చదవండి: KCL: సంజూ శాంసన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే! వీడియో వైర‌ల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)