Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు కొత్త కెప్టెన్‌

Published on Mon, 03/13/2023 - 15:53

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు నూతన సారధిని ఎంపిక చేసింది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ). షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరలో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఈ నియామకం చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. వర్క్‌ లోడ్‌ కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, షాహీన్‌ అఫ్రిది, ఫకర్‌ జమాన్‌, హరీస్‌ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చి కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ సోమవారం (మార్చి 13) ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బృందంలో సైమ్‌ అయూబ్‌, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) స్టార్లకు తొలిసారి అవకాశం కల్పించిన పీసీబీ.. సీనియర్‌ ఇమాద్‌ వసీంను చాలాకాలం తర్వాత తిరిగి జట్టులోకి తీసుకుంది. పీసీబీ సెలెక్షన్‌ కమిటీ నూతన చీఫ్‌ హరూన్‌ రషీద్‌ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్‌ లోడ్‌ పాలసీ ఆధారంగా సెలెక్షన్‌ ప్రక్రియ సాగినట్లు పీసీబీ పేర్కొంది. 

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్‌ జట్టు..
షాదాబ్‌ ఖాన్‌ (కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్‌, ఆజమ్‌ ఖాన్‌ (వికెట్‌కీపర్‌), ఫహీమ్‌ అష్రాఫ్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఇహసానుల్లా, ఇమాద్‌ వసీం, మహ్మద్‌ హరీస్‌ (వికెట్‌కీపర్‌), మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీం, నసీం షా, సైమ్‌ అయూబ్‌, షాన్‌ మసూద్‌, తయాబ్‌ తాహిర్‌, జమాన్‌ ఖాన్‌ 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)