Breaking News

ఆసీస్‌పై సిరీస్‌ విజయం.. పాక్ క్రికెటర్‌కు బంపరాఫర్‌!

Published on Fri, 06/05/2026 - 16:53

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్‌లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్‌రౌండర్ షాదాబ్‌ఖాన్‌ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్‌) తొలి ఎడిషన్‌లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్‌ లీగ్‌లో ఆడనున్న తొలి పాక్  క్రికెటర్‌గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. 

ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్  ఎడిన్‌బర్గ్ క్యాసిల్ రాకర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్‌బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్‌మిల్స్‌, నాథన్ మెక్‌కల్లమ్‌లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్‌, టామ్ కరన్‌, జేజే స్మట్స్‌, ఆండ్రీ గౌస్‌తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. 

కాగా ఎడిన్‌బర్గ్ మంచి ధరకే షాదాబ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్‌లో ఈ పాకిస్తాన్ క్రికెటర్‌కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో (పీఎస్‌ఎల్‌) ఇస్లామాబాద్ యునైటెడ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్‌ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. 

పీఎస్‌ఎల్‌, బీబీఎల్‌, సీపీఎల్‌, బీపీఎల్‌, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్‌లాడిన షాదాబ్‌ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. 

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్‌, నాథన్ మెక్‌కల్లమ్ (ఎడిన్‌బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్‌), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఐరిష్ వోల్వ్స్‌), స్టీవ్ వా (ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌), జాంటీ రోడ్స్‌, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్‌డామ్ డాకర్స్‌)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.

చదవండి: గాయాల బారిన సీనియ‌ర్లు.. టీమిండియాకు షాక్ త‌ప్ప‌దా?

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)