Breaking News

BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్‌

Published on Thu, 06/19/2025 - 10:46

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్‌ తగిలింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్‌ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్‌లో ఒక సీజన్‌ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొచ్చి టస్కర్స్‌ కేరళ టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. 

ఎనిమిదో స్థానంలో
కాగా ఐపీఎల్‌- 2011 సీజన్‌లో మాత్రమే ఆడిన టస్కర్స్‌ టీమ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్‌మెంట్‌ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్‌ను బీసీసీఐ లీగ్‌ నుంచి తప్పించింది.

ఈ విషయంపై... టీమ్‌లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేసీపీఎల్‌), రెండేవూ స్పోర్ట్స్‌ వరల్డ్‌ (ఆర్‌ఎస్‌డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్‌ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 

అయితే, ఆర్బిట్రేటర్‌ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్‌ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్‌కు రూ.385.50 కోట్లు, ఆర్‌ఎస్‌డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్‌ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది.    

ప్రస్తుతం పది
కాగా ఐపీఎల్‌లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్‌ గెలవగా.. కోల్‌కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. 

ఇక 2008 నాటి తొలి సీజన్‌లో రాజస్తాన్‌ చాంపియన్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఒక్కోసారి టైటిల్‌ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్‌-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్‌తో పాటు దక్కన్‌ చార్జర్స్‌, గుజరాత్‌ లయన్స్‌ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ దక్కన్‌ చార్జర్స్‌ కూడా ఓసారి టైటిల్‌ గెలిచింది.

చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్‌ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు