Breaking News

టీమిండియా పేసర్‌ షమీకి భారీ షాక్‌! కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక

Published on Thu, 07/06/2023 - 15:54

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిగా ఉంటున్న అతడి భార్య హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీన్‌ జహాన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టి నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఏళ్లకు ఏళ్లు ఈ కేసును సాగదీయడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. కాగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ గృహహింస కేసు పెట్టిన హసీన్‌ జహాన్‌.. అతడి అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో సుప్రీం కోర్టు గురువారం ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది. కేసును సాగదీయకుండా సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్‌ సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. కాగా షమీపై హసీన్‌ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో 2019, ఆగష్టు 29న అలీపూర్‌  అడిషినల్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ అతడిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించిన షమీ సెప్టెంబరు 9న తన అరెస్టుపై స్టే విధించాల్సిందిగా కోరాడు. అదే విధంగా తనపై ఎలాంటి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత హసీన్‌ ఈ విషయమై హైకోర్టును సంప్రదించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఇక ఇదంతా జరిగి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ కేసు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నెలరోజుల్లోగా కేసును పరిష్కరించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే స్టే ఆర్డర్‌లో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్‌ కోర్టు జడ్జిని ఆదేశించింది. 

చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్‌! వీడియో వైరల్‌

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు