Breaking News

సౌతాఫ్రికా ఓపెనర్ల సరికొత్త చరిత్ర.. పాక్‌ గడ్డపై రికార్డుల మోత

Published on Fri, 09/19/2025 - 20:34

సౌతాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్‌, తంజిమ్‌ బ్రిట్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డుల్లోకెక్కారు. అలాగే పాకిస్తాన్‌ గడ్డపై వన్డే క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు.

లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 19) పాకిస్తాన్‌, సౌతాఫ్రికా మహిళా జట్లు వన్డే మ్యాచ్‌ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్‌, లారా తొలి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్‌లో తొలి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఏ వికెట్‌కైనా ఆరో అత్యధిక భాగస్వామ్యం.

మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు భారత జోడీ పేరిట ఉంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌ తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు (టాప్‌-6)
దీప్తి శర్మ-పూనమ్‌ రౌత్‌ (భారత్‌, 320, తొలి వికెట్‌కు)
కెర్‌-క్యాస్పరెక్‌ (న్యూజిలాండ్‌, 295, రెండో వికెట్‌కు)
టేలర్‌-బేమౌంట్‌ (ఇంగ్లండ్‌, 275, రెండో వికెట్‌కు)
టేలర్‌-అట్కిన్స్‌ (ఇంగ్లండ్‌, 268, తొలి వికెట్‌కు)
టిఫెన్‌-బేట్స్‌ (న్యూజిలాండ్‌, 262, రెండో వికెట్‌కు)
వోల్వార్డ్ట్‌-బ్రిట్స్‌ (సౌతాఫ్రికా, 260, రెండో వికెట్‌కు)

మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. తంజిమ్‌ బ్రిట్స్‌ 171 పరుగులతో (141 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా ఉండగా.. కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ 100 పరుగులు (129 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔటైంది. పాక్‌ బౌలర్లలో డయానా బేగ్‌కు 2 వికెట్లు దక్కాయి.

కాగా, సౌతాఫ్రికా మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చితు​ చేసింది. మూడో వన్డే లాహోర్‌లోనే సెప్టెంబర్‌ 22న జరుగనుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)