Breaking News

ఒకే రోజు 23 వికెట్లు

Published on Fri, 01/23/2026 - 03:47

రాజ్‌కోట్‌: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్‌మన్‌ గిల్‌... దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన గిల్‌ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్‌ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. 

మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్‌ గోహిల్‌ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్‌ దేశాయ్‌ (13), చిరాగ్‌ జానీ (8), అర్పిత్‌ (2), సమర్‌ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు. ప్రేరక్‌ మన్కడ్‌ (32) ఫర్వాలేదనిపించాడు. 

పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. గిల్‌తో పాటు హర్‌నూర్‌ సింగ్‌ (0), నేహల్‌ వధేరా (6), ప్రేరిత్‌ దత్తా (11), ఉదయ్‌ శరణ్‌ (23) విఫలమయ్యారు. 

సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్‌ భట్‌ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్‌ దేశాయ్‌ (6), చిరాగ్‌ జానీ (5), జయ్‌ గోహిల్‌ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్‌గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. 

కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్‌ 34 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)