Breaking News

కోహ్లితో పరిచయం లేదు.. వికెట్‌ తీసినందుకు ఏమన్నాడంటే!

Published on Fri, 06/14/2024 - 13:10

తనకు ఇష్టమైన రెండు రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందని అమెరికా క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ అన్నాడు. తన కెరీర్‌ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదని.. అంతా త్వరత్వరగా జరిగిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.

ఏదేమైనా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ తీయడం భావోద్వేగ క్షణంగా మిగిలిపోతుందని సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఎమోషనల్‌ అయ్యాడు. కాగా భారత్‌కు చెందిన నేత్రావల్కర్‌ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడాడు.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి
అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ యువ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. సీనియర్‌ జట్టులో చోటు దక్కకకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడే ఒరాకిల్‌లో ఉద్యోగం సంపాదించిన నేత్రావల్కర్‌.. ప్రస్తుతం అమెరికా తరఫున టీ20 ప్రపంచకప్‌-2024 బరిలో దిగాడు.

విరాట్‌ కోహ్లిని గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపి
ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లిని గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపిన నేత్రావల్కర్‌.. రోహిత్‌ శర్మ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే రెండు బిగ్‌ వికెట్లు తీసి మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అమెరికా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే కెనడా, పాకిస్తాన్‌లపై విజయాలతో గ్రూప్‌-ఏ సెకండ్‌ టాపర్‌గా సూపర్‌-8కు చేరువైంది.

ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ అనంతరం తన భావాలు పంచుకున్న సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెండు రంగాల్లో కెరీర్‌ కొనసాగించడం ఆనందంగా ఉంది. అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.

విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇక గత రెండు మ్యాచ్‌లు(పాక్‌, భారత్‌) అత్యంత కీలకమైనవి. విరాట్‌ వికెట్‌ తీయడం ఓ ఎమోషనల్‌ మూమెంట్‌.

అతడికి బౌలింగ్‌ చేస్తున్నపుడు ఆఫ్‌ స్టంప్ ఎగురగొట్టాలని భావించా. నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి వికెట్‌ తీశా. అండర్‌-15, అండర్‌-17 డేస్‌ నుంచే నాకు సూర్యకుమార్‌ యాదవ్‌ తెలుసు.

మేము కలిసినపుడు నాటి డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి చర్చించుకుంటాం. అయితే, విరాట్‌తో నాకు అంతగా పరిచయం లేదు కానీ.. అతడి వికెట్‌ తీసిన తర్వాత నన్ను అభినందించాడు’’ అని సౌరభ్‌ నేత్రావల్కర్‌ పేర్కొన్నాడు. 

చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్‌గ్రౌండ్‌!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)