చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు

Published on Thu, 01/08/2026 - 17:30

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటిం‍గ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.

ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్  వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

త‌ద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా స‌ర్ఫ‌రాజ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లి, రోహిత్‌ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.

మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ ..  ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం​ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్‌. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్‌ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.
చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)