Breaking News

సంజూ శాంసన్‌కు భారీ షాక్‌

Published on Thu, 04/11/2024 - 11:45

IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్‌లో రాజస్తాన్‌ బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ బాది తమ జట్టును గెలిపించాడు.

ఫలితంగా ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ విజయపరంపరకు బ్రేక్‌ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఓవర్‌ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలిగిన గుజరాత్‌ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు.

ఇక స్లో ఓవర్‌ రేటు కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు పనిష్‌మెంట్‌ ఇచ్చారు ఐపీఎల్‌ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్‌-2024లో జైపూర్‌లోని సవాయి మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు  జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్‌ వేసింది. 

ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు.

చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)