Breaking News

సంజూ శాంసన్‌ ఊహించని నిర్ణయం

Published on Thu, 07/09/2026 - 19:03

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్న కేర‌ళ క్రికెట్ లీగ్ (KCL 2026) మూడో సీజన్ నుంచి శాంస‌న్ వైదొలిగాడు. జూలై 11న జరగబోయే ప్లేయర్స్ వేలం కోసం కూడా అతడు తన కూఐడా పేరును నమోదు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేసీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ నాజర్ మచాన్ ధ్రువీకరించారు. 

వ్యక్తిగత కారణాల వల్ల సంజూ ఈ ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని మచాన్‌ స్పష్టం చేశారు. గత సీజన్‌లో శాంసన్‌  'కొచ్చి బ్లూ టైగర్స్' ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. కేవలం మూడు  మ్యాచ్‌లలోనే ఓ అద్భుత సెంచరీతో సహా మొత్తం 221 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది సీజన్‌ వేలానికి ముందు అతడిని కొచ్చి విడుదల చేసింది.

దీంతో శాంసన్‌ వేలంలోకి వస్తాడని అంతా భావించారు. కానీ అతడు ఇప్పుడు పూర్తిగా తప్పుకొని షాకిచ్చాడు. కాగా సంజూ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమవుతున్నాడు. యూకే పర్యటనలో ఉన్న శాంసన్‌ వరుసగా మూడు మ్యాచ్‌లలో తీవ్ర నిరాశపరిచాడు. ఐర్లాండ్‌ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమైన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. 

దీంతో తర్వాత రెండు మ్యాచ్‌లకు అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు సంజూను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్ధానంలో యువ  వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌కు అవకాశమిచ్చారు. అయితే మిగితా సీనియర్‌ బ్యాటర్లంతా ఉన్నప్పటికి ఒక్క శాంసన్‌నే జట్ట నుంచి తప్పించడం క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

అతడిని కావాలనే పక్కన పెట్టారాని బీసీసీఐ సెలక్టర్లపై కొంతమంది విమర్శలు గుప్పించారు. కానీ గత 6 నెలలగా అవిరామంగా క్రికెట్‌ ఆడుతున్నందునే సంజూకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల (Asian Games 2026)కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)