Breaking News

పాపం సంజూ.. వ‌ర‌ల్డ్ మోస్ట్ అన్‌ల‌క్కీ క్రికెట‌ర్‌

Published on Mon, 11/24/2025 - 08:33

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఆదివారం ప్ర‌క‌టించింది.  రెగ్యులర్ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో సీనియ‌ర్ బ్యాట‌ర్‌ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.

అదేవిధంగా ఈ సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా గాయాల కార‌ణంగా దూర‌మ‌య్యారు. సీనియర్‌ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.

దిగ్గ‌జ‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర క్రికెట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఛాన్నాళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి తిరిగొచ్చాడు. గిల్‌ స్ధానంలో గైక్వాడ్‌కు చోటు దక్కింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్ధానంలో తిలక్‌ వర్మకు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

సంజూ మ‌రో 'సారీ'..
ఇక భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌కు మ‌రోసారి సెల‌క్ట‌ర్లు మొండిచేయి చూపించారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. పంత్ కూడా ఏడాది త‌ర్వాత వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చాడు. 

పంత్ గైర్హ‌జ‌రీలో కూడా సంజూకు చోటు ద‌క్క‌లేదు. వ‌న్డేల్లో కూడా బ్యాక‌ప్ వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్‌ను సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. సఫారీలతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో కూడా జురెల్‌ ఉన్నాడు. ఈ క్రమంలో వ‌న్డేల్లో మంచి రికార్డు ఉన్న‌ప్ప‌టికి సంజూను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఫైర‌వ‌తున్నారు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.

శాంస‌న్ చివ‌ర‌గా 2023 డిసెంబరులో దక్షిణాఫ్రికాపై వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత శ్రీలంక‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల‌తో సిరీస్‌ల‌కు అత‌డికి చోటు ద‌క్క‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు 16 వ‌న్డేలు ఆడిన సంజూ  56.66 స‌గ‌టుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్, జైస్వాల్,  విరాట్ కోహ్లి, తిలక్‌ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్‌, ధ్రువ్‌ జురెల్‌.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)