లంకతో సిరీస్‌కు దూరమవడంపై స్పందించిన సంజూ.. ఏమన్నాడంటే..?

Published on Fri, 01/06/2023 - 09:50

Sanju Samson: గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌ (టీ20) నుంచి మిడిల్‌ డ్రాప్‌ అయిన సంజూ శాంసన్‌ తొలిసారి స్పందించాడు. ఆల్‌ ఈజ్‌ వెల్‌.. సీ యూ సూన్‌  అంటూ ఇన్‌స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. సంజూ తన పోస్ట్‌లో తొలి టీ20 సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఫోటో షేర్‌ చేశాడు. సంజూ చేసిన ఈ పోస్ట్‌కు టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా, వన్డే తాత్కాలిక సారధి శిఖర్‌ ధవన్‌ స్పందించారు.

హార్ధిక్‌.. హార్ట్‌ ఏమోజీతో రిప్లై ఇవ్వగా, ధవన్‌.. గెట్‌ వెల్‌ సూన్‌ బ్రో అంటూ బదులిచ్చాడు. సంజూ గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి బరిలోకి దిగాలని అతని అభిమానులు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. 

కాగా, లంకతో తొలి టీ20 సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ సంజూ శాంసన్‌ గాయపడిన విషయం తెలిసిందే. సంజూ గాయం తీవ్రమైంది కానప్పటికీ.. మున్ముందు జట్టు అవసరాల దృష్ట్యా బీసీసీఐ అతన్ని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి విశ్రాంతినిచ్చింది.

బీసీసీఐ వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. సంజూ ఎడమ కాలి మోకాలి భాగంలో స్వల్ప గాయమైందని, కదలికలో సమస్య ఉన్నట్లు స్కాన్‌ రిపోర్ట్‌లో గుర్తించినందున కొద్దిరోజుల పాటు విశ్రాంతినివ్వాలని వారు బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బోర్డు తదనుగుణంగానే సంజూకు పాక్షికంగా విశ్రాంతి కల్పిస్తూ.. లంకతో మిగతా టీ20లకు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ జితేశ్‌ శర్మను ఎంపిక చేసింది. 

ఇదిలా ఉంటే, తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్‌.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌.. శాంసన్‌ చెత్త షాట్‌ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్‌ ఆగ్రహానికి గురయ్యాడు.  
 

Videos

విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..

మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? పెమ్మసానికి బిగ్ షాక్

పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్

గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!

నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి

ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు

ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్

మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్

ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం

బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్

Photos

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)