Breaking News

సంజూ శాంసన్ సక్సెస్ వెనుక భారత క్రికెట్‌ దిగ్గజం

Published on Mon, 03/09/2026 - 17:19

భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్‌ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.  తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.

అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్'  గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. 

వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్‌, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు.

"అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.

గత రెండు నెలలుగా సచిన్‌ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు.  ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)