Breaking News

‘నేను వెళ్లిపోతా...వదిలేయండి’

Published on Fri, 08/08/2025 - 04:11

జైపూర్‌: ఐపీఎల్‌ జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు సామ్సన్‌కు, టీమ్‌ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామంతో స్పష్టమైంది. రాజస్తాన్‌ టీమ్‌లో సుదీర్ఘ కాలంగా భాగమైన సంజు సామ్సన్‌ జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌–2026 సీజన్‌కు ముందు తనను విడుదల చేయాలని అతను ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాది లీగ్‌ ముగియగానే సామ్సన్‌ తన మనసులో మాటకు మేనేజ్‌మెంట్‌కు వెల్లడించాడు. అయితే దీనిపై రాయల్స్‌ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

2025లో రూ.18 కోట్లతో సామ్సన్‌ను జట్టు అట్టి పెట్టుకుంది. అయితే గాయం కారణంగా సామ్సన్‌ 9 మ్యాచ్‌లే ఆడాడు. 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన రాయల్స్‌ 9వ స్థానంతో ముగించింది. తాను కోలుకున్నా రియాన్‌ పరాగ్‌కే కెపె్టన్సీ కొనసాగించడంతో పాటు సీజన్‌కు ముందు జోస్‌ బట్లర్‌ను టీమ్‌ వదిలేసుకోవడంపై కూడా యాజమాన్యంతో సామ్సన్‌కు విభేదాలు వచ్చాయి. 

2013 నుంచి 2015 వరకు రాజస్తాన్‌ తరఫున ఆడిన సంజు ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడి 2018లో మళ్లీ రాయల్స్‌కే వచ్చాడు. 2021లో అతనికి కెప్టెన్సీ ఇవ్వగా తర్వాతి ఏడాదే జట్టు ఫైనల్‌కు కూడా చేరింది. మొత్తం జట్టు తరఫున 11 సీజన్లలో కలిపి అతను 149 మ్యాచ్‌లు ఆడి 4027 పరుగులు చేశాడు.    

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)