తీరు మార‌ని సంజూ శాంస‌న్‌.. హోం గ్రౌండ్‌లోనూ

Published on Sat, 01/31/2026 - 19:42

టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడు.

6 బంతులు ఎదుర్కొన్న శాంసన్‌ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి  తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో జాకబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంస‌న్ కేవ‌లం 46 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డిని నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

తిల‌క్ వ‌ర్మ పున‌రాగ‌మ‌నం చేస్తే తుది జ‌ట్టులో సంజూ స్ధానం గ‌ల్లంతే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కార‌ణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ.. త్వ‌ర‌లోనే జ‌ట్టులో చేర‌నున్నాడు. తిల‌క్ జ‌ట్టులోకి వ‌స్తే ఇషాన్ కిష‌న్ లేదా సంజూ శాంస‌న్‌లో ఎవ‌రో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వ్వాలి. 

అయితే ఇషాన్ త‌న రీఎంట్రీలో స‌త్తాచాటుతున్నాడు. శాంస‌న్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన‌ర్‌గా కూడా కిష‌న్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేప‌థ్యంలో సంజూపై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. ఇషాన్‌ కిష‌న్.. అభిషేక్‌తో కలిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంది.

అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆసియాకప్‌, సౌతాఫ్రికా సిరీస్‌లో ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. దీంతో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  ఈ క్రమంలో గిల్‌ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్‌ను ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉపయోగించుకోలేకపోయాడు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)