Breaking News

వేలంలో రికార్డులు బ‌ద్ద‌లు.. అత్యంత ఖరీదైన ఆట‌గాడిగా సంజూ శాంస‌న్‌

Published on Sat, 07/05/2025 - 11:16

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్(Sanju Samson) తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడ‌నున్నాడు. శ‌నివారం తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన‌ కేసీఎల్‌ సీజ‌న్-2 ఆట‌గాళ్ల వేలంలో శాంస‌న్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

తద్వారా కేరళ క్రికెట్ లీగ్  చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ నిలిచాడు. అత‌డి కోసం కొచ్చి ఫ్రాంచైజీ త‌మ ప‌ర్స్‌లో ఉన్న స‌గానికిపైగా మొత్తాన్ని వెచ్చింది. తొలుత శాంస‌న్ బిడ్డింగ్ పోరు రూ.5 లక్షలతో ప్రారంభమైంది. త్రిస్సూర్ టైటాన్స్ ఒక్క‌సారిగా రూ.20 లక్షలకు బిడ్‌ను పెంచింది.

అయితే ఆఖ‌రికి కొచ్చి 26.80 లక్షలు వెచ్చించి అత‌డిని కైవ‌సం చేసుకుంది. వేలంలో ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు కేసీఎల్ మెనెజ్‌మెంట్  రూ. 50 ల‌క్ష‌లు కేటాయించింది. ఇప్పుడు సంజూ శాంస‌న్‌పైనే 26.80 లక్షలు వెచ్చించడంతో కొచ్చి వ‌ద్ద రూ. 23.2 లక్షలే మిగిలియాయి. దీంతో వేలంలో మిగితా స్టార్ ప్లేయ‌ర్ల‌ను సొంతం చేసుకోవ‌డం కొచ్చి క‌ష్టం కావ‌చ్చు.

ఈ వేలం ముందువ‌ర‌కు కెసీఎల్‌లో అత్య‌ధిక ధ‌ర క‌లిగిన రికార్డు ఎం. సజీవన్ పేరిట ఉండేది. తొలి ఎడిష‌న్‌లో స‌జీవ‌న్‌ను త్రివేండ్రం రాయల్స్  రూ.7.4 లక్షలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు సంజూ ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

ఈ ఏడాది వేలంలో సంజూ కంటే ముందు బాసిల్ తంపిని రూ.8.4 లక్షలకు తివేండ్రం రాయ‌ల్స్ సొంతం చేసుకుంది. సంజూ ప్ర‌స్తుతం భార‌త టీ20 జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు. అయితే ఈ మ‌ధ్య‌లో టీ20 సిరీస్‌లు లేక‌పోవ‌డంతో కెసీఎల్ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండ‌నున్నాడు. కెసీఎల్ సీజ‌న్‌-2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.
చదవండి: IND vs ENG: రివ్యూ తీసుకున్న జైశ్వాల్‌.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్‌! వీడియో
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)