Breaking News

జడ్డూ దెబ్బకి పాక్‌ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. రక్తమొచ్చేసింది! వీడియో వైరల్‌

Published on Tue, 09/12/2023 - 13:19

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి అస్సలు అదృష్టం కలిసిరాలేదు. తొలుత బౌలింగ్‌లో స్టార్‌ పేసర్లు హ్యారీస్‌ రవూఫ్‌, నసీంషా గాయపడి ఆటకు దూరం కాగా.. బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 357 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆఘా సల్మాన్‌ పాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే స్పిన్నర్లు ఎటాక్‌ చేస్తుండడంతో హెల్మట్‌ తీసి ఆడాలని సల్మాన్‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పాక్‌ ఇన్నింగ్స్‌ 21 ఓవర్‌ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సల్మాన్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని అతడి ముఖానికి బలంగా తాకింది.

కంటి కింద గాయం కాగా.. రక్తం కూడా వచ్చింది. దీంతో మైదానంలోనే సల్మాన్‌ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అతడు వద్దకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ తర్వాత  ఫిజియో వచ్చి కంకషన్‌ టెస్టు చేశాడు.

అయితే అతడి గాయం అంతతీవ్రమైనది కాకపోవడం ఆటను సల్మాన్‌ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భారత్‌ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్‌ చిత్తైంది.
చదవండి: బట్టలు ఉతికినట్లు.. ఉతికి ఆరేశారు! రాహుల్‌, బుమ్రా సూపర్‌! ఓపెనర్లు కూడా: టీమిండియా దిగ్గజం

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)