Breaking News

టీమిండియా తాత్కాలిక కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే

Published on Sun, 07/21/2024 - 18:30

త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియాకు తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా సాయిరాజ్‌ బహుతులే ఎంపికయ్యాడు. 51 ఏళ్ల బహుతులే ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్నాడు. లంక పర్యటనకు రెగ్యులర్‌ బౌలింగ్‌ కోచ్‌ లేకపోవడంతో బీసీసీఐ బహుతులేను తాత్కాలిక ప్రతిపదికన ఎంపిక చేసింది. 

బహుతులే.. అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ టెన్‌ డెస్కటే, టి దిలీప్‌లతో కలిసి గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలోని భారత కోచింగ్‌ శిబిరంలో జాయిన్‌ అవుతాడు. బహుతులే..  1997-2003 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన బహుతులే టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, ఎనిమిది వన్డేలు ఆడాడు. 

కాగా, టీమిండియా.. శ్రీలంక పర్యటన ఈనెల 27 నుంచి మొదలవ్వనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతోనే గంభీర్‌ భారత హెడ్‌ కోచ్‌గా తన ప్రస్తానాన్ని మొదలుపెడతాడు. గంభీర్‌ కోచింగ్‌ టీమ్‌లో దిలీప్‌ తప్పించి మిగతా వారంతా కొత్తవారే. 

భారత రెగ్యులర్‌ బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ ఎంపిక దాదాపుగా ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి. అయితే మోర్కెల్‌ వ్యక్తిగత కారణాల చేత లంక టూర్‌కు అందుబాటులో ఉండనని చెప్పడంతో బీసీసీఐ తాత్కాలిక ఏర్పాటు చేసింది. మోర్కెల్‌.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సమయానికి అందుబాటులోకి రావచ్చు.

ఇదిలా ఉంటే, లంక పర్యటనలో భారత్‌ తొలుత టీ20 సిరీస్‌ ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అనంతరం​ ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు పల్లెకెలె.. వన్డేలకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇదివరకే ఎంపిక చేశారు. టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డే టీమ్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. 

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)