Breaking News

టీమిండియాకు మరో భారీ షాక్‌..!?

Published on Tue, 08/04/2026 - 12:49

శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు మ‌రో భారీ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా గాయం కార‌ణంగా శ్రీలంక టూర్‌కు దూరం కాగా.. ఇప్పుడు యువ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ అందుబాటుపై కూడా సందేహాలు నెలకొన్నాయి.

స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఏకైక టెస్ట్ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ కాలి బొటనవేలికి గాయ‌మైంది. సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. శ్రీలంకతో సిరీస్ సమయానికి సుదర్శన్ పూర్తిగా కోలుకుంటాడని భావించిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ.. భార‌త జ‌ట్టులో అత‌డికి చోటు క‌ల్పించింది.

అయితే సిరీస్‌కు ముందు అత‌డు త‌న ఫిట్‌నెస్ నిరూపించుకోవాల‌ని సెల‌క్ట‌ర్లు కండీషన్ పెట్టారు. కానీ సుద‌ర్శ‌న్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్టనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్ కోసం శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు మంగ‌ళ‌వారం శ్రీలంకకు ప‌య‌నం కానుంది.

కానీ సుద‌ర్శ‌న్‌ మాత్రం భార‌త జ‌ట్టుతో క‌లిసి శ్రీలంకకు వెళ్ల‌డం లేద‌ని రేవ్‌స్పోర్ట్స్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. సీవోఈ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లభించిన తర్వాతే అతడు కొలంబోలోని జట్టుతో కలిసే అవకాశం ఉందని  రేవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.  సుదర్శన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు. 

త్వ‌ర‌లోనే అత‌డికి ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో అత‌డు పాసైతేనే శ్రీలంక విమానం ఎక్కుతాడు. ఒక‌వేళ అత‌డు సిరీస్‌కు దూర‌మైతే తుది జ‌ట్టులో క‌ర్ణాట‌క ఆట‌గాడు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్‌కు అవ‌కాశం ద‌క్క‌నుంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభం కానుంది. అంత‌కంటే ముందు స్ధానిక జ‌ట్టుతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)