Breaking News

తీసేస్తారన్న సమయంలో ఆడతాడు.. అదే ప్రత్యేకత!

Published on Sun, 05/07/2023 - 18:15

ఐపీఎల్‌లో ఆరంభ సీజన్‌ నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో వృద్దిమాన్‌ సాహా ఒకడు. వికెట్‌ కీపర్‌ అనే ట్యాగ్‌లైన్‌ ఉండడంతో సాహా ఇన్నేళ్లయినా ఐపీఎల్‌లో కొనసాగుతూ వస్తున్నాడు. ఈ 16 ఏళ్లలో ఎన్నో జట్లకు ఆడిన సాహా మంచి అనుభవాన్నే గడించాడు. 

గతేడాది సాహా గుజరాత్‌ టైటాన్స్‌లోకి వెళ్లడం.. అరంగేట్రం ఏడాదిలోనే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో సాహా జట్టులో రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారిపోయాడు. దీనికి తోడు గుజరాత్‌కు నిఖార్సైన వికెట్‌ కీపర్‌ అవసరం ఉండడంతో సాహాను పక్కనబెట్టడానికి పాండ్యా ఇష్టపడలేదు. అంతేకాదు గుజరాత్‌ టైటాన్స్‌ తరపున బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వస్తున్నాడు.

తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో  సాహా అంతగా రాణించింది లేదు. ఒకటో రెండో మ్యాచ్‌ల్లో తన ప్రభావం చూపించిన సాహా తొందరగానే ఔటయ్యేవాడు. వచ్చీ రావడంతో బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే ప్రయత్నంలో వికెట్‌ పారేసుకునేవాడు. కేఎస్‌ భరత్‌  లాంటి నాణ్యమైన వికెట్‌కీపర్‌ ఉన్నా పాండ్యా మాత్రం సాహాకే అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే సాహాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇక ఆడడం లేదు.. జట్టులో చోటు కోల్పోవడం ఖాయం అనుకున్న దశలో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు.

తాజాగా ఆదివారం(మే 7న) లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ సీజన్‌లో సాహా తొలిసారి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. 43 బంతుల్లో 81 పరుగులు చేసిన సాహా ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో సాహా బ్యాటింగ్‌ చూస్తుంటే సెంచరీ కూడా చేస్తాడేమో అన్నంతలా సాగింది. ఇప్పుడే కాదు ప్రతీ సీజన్‌లోనూ సాహాకు ఇది అలవాటే. 14 మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక్కటి మాత్రమే గుర్తుంచుకునే ఇన్నింగ్స్‌లు ఒకటో, రెండో ఉంటాయి.

చదవండి: అన్నదమ్ముళ్ల అనుబంధం.. 'నాన్న గర్వంగా ఫీలయ్యేవారు'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)