Breaking News

టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ

Published on Mon, 07/15/2024 - 14:14

అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్‌-2024తో  ముగిసింది. ఈ మెగా ఈవెంట్‌ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.

ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్‌ ఎవరా అన్న అంశంపై క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్‌ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్‌ కీపర్‌.. కొత్త కోచ్‌ గౌతం గంభీర్‌, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.

ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్‌ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట​ ఆడడు.

కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్‌గా చూస్తే హార్దిక్‌ పాండ్యానే కెప్టెన్‌ను చేయాలి.

ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌-2024లో అతడిని వైస్‌ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్‌ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.

రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్‌కప్‌ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.

కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్‌ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్‌ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)