సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Fri, 06/07/2024 - 20:52

సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్‌ మూడో ఎడిషన్‌ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోయే తేదీలను క్రికెట్‌ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్‌ స్మిత్‌ ప్రకటించారు. 

SA20 2025 సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్‌ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్‌, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్‌ తెలిపాడు.

కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్‌ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌.. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 

దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, పార్ల్‌ రాయల్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.

ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్‌ క్లాసెన్‌ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్‌ బార్ట్‌మన్‌కు (30 వికెట్లు) దక్కుతుంది. 

కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్‌ పోలార్డ్‌ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు కేశవ్‌ మహారాజ్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌కు డెప్లెసిస్‌, పార్ల్‌ రాయల్స్‌కు డేవిడ్‌ మిల్లర్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్‌ పార్నెల్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్‌ మార్క్రమ్‌ సారథులుగా వ్యవహరిస్తున్నారు. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)