Breaking News

SA Vs Aus: క్లాసెన్‌ సునామీ ఇన్నింగ్స్‌.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు

Published on Sat, 09/16/2023 - 12:17

Heinrich klaasen 174: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 83 బంతుల్లో 13, 13 సిక్సర్ల సాయంతో ఏకంగా 174 పరుగులు సాధించాడు.

టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు
57 బంతుల్లోనే సెంచరీ సాధించిన క్లాసెన్‌.. వన్డే ఫార్మాట్లో ఐదో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ సునామీ ఇన్నింగ్స్‌ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 

ఆసీస్‌పై 164 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ సమం
మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన కంగారూలు.. తొలి రెండు వన్డేల్లోనూ జయభేరి మోగించారు. ఈ క్రమంలో వరుస ఓటముల నుంచి తేరుకున్న ఆతిథ్య ప్రొటిస్‌ జట్టు మూడో మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 

ఆసీస్‌కు ఊహించని షాక్‌లు
ఈ క్రమంలో శుక్రవారం ఇరు జట్లు సెంచూరియన్‌ వేదికగా నాలుగో వన్డేలో తలపడ్డాయి. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు హెన్రిచ్‌ క్లాసెన్‌ చుక్కలు చూపించాడు. అద్భుత శతకంతో మెరిసి.. సౌతాఫ్రికాకు 416 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో కంగారూలకు ఊహించని షాక్‌లు తగిలాయి.

ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 12 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. ట్రవిస్‌ హెడ్‌ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్‌ అయింది. అలెక్స్‌ క్యారీ 99 పరుగులతో పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్‌ అయిన ఆసీస్‌.. 164 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 

వన్డేల్లో అత్యధికసార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసిన జట్లు
►సౌతాఫ్రికా- 7 సార్లు
►టీమిండియా- 6 సార్లు
►ఇంగ్లండ్‌- 5 సార్లు
►ఆస్ట్రేలియా- 2 సార్లు
►శ్రీలంక- 2 సార్లు.

చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్‌ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్‌ శర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)