Breaking News

సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో అతి భారీ పరాజయం

Published on Thu, 08/31/2023 - 19:17

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు టీ20ల్లో భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా స్వదేశంలో (డర్బన్‌) ఆస్ట్రేలియాతో నిన్న (ఆగస్ట్‌ 30) జరిగిన తొలి మ్యాచ్‌లో 111 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన ప్రొటీస్‌.. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా అతి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. పరుగుల పరంగా సఫారీలు టీ20ల్లో ఎదుర్కొన్న భారీ పరాజయాల్లో టాప్‌-4 ఆసీస్ చేతుల్లోనే కావడం విశేషం.

నిన్నటి మ్యాచ్‌ తర్వాత అతి పెద్ద పరాజయాన్ని సౌతాఫ్రికా 2020లో ఎదుర్కొంది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఆ తర్వాత అతి భారీ పరాజయాన్ని కూడా సౌతాఫ్రికా అదే ఏడాది చవిచూసింది. 2020లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 97 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీని తర్వాతి భారీ పరాజయం సౌతాఫ్రికాకు 2006లో ఎదురైంది. నాడు బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 95 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తయ్యారు. ఇలా టీ20ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఎదుర్కొన్న భారీ పరాజయాలన్నీ ఆసీస్‌ చేతిలోనే కావడం ఆసక్తికరం.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. మిచెల్‌ మార్ష్‌ (49 బంతుల్లో 92 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (28 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం 227 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 115 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్‌ సంఘా 4 వికెట్లు, మార్కస్‌ స్టోయినిస్‌ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్‌(56) మినహా అందరూ విఫలమయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)