Breaking News

గంభీర్‌ మార్క్‌.. భారత ఫీల్డింగ్‌ కోచ్‌గా నెదర్లాండ్స్‌ లెజెండ్‌!?

Published on Thu, 07/11/2024 - 13:51

భారత జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ  ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంక పర్యటనతో అతడు తన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.

ఈ క్రమంలో తన సహాయక సిబ్బంది నియామకంపై గంభీర్‌ కసరత్తులు మొదలెట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్‌ క్రికెట్‌ దిగ్గజం ర్యాన్‌ టెన్‌ డష్కాటేను తన టీమ్‌లోకి తీసుకునేందుకు గంభీర్‌ ఆసక్తిగా ఉ న్నట్లు  తెలుస్తోంది.

అతడికి ఫీల్డింగ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించే అవకాశముందని క్రిక్‌బజ్‌ తమ కథనంలో పేర్కొంది. తాజాగా టెన్‌ డష్కాటేను ఉద్దేశించి గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ర్యాన్ టెన్‌ డష్కాటే నిస్వార్థపరుడని, తను జీవితాంతం నమ్మే  వ్యక్తి అతడేనని గంభీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు. 

దీంతో డష్కాటే గంభీర్‌ కోచింగ్‌ స్టాప్‌లో భాగం కావడం దాదాపు ఖారారైనట్లు అభిమానులు భావిస్తున్నారు.  కాగా టెన్‌ డష్కాటేకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.  కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, యూఏఈ టీ20 వంటి  ప్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌ల్లో సపోర్ట్‌ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. 

నెదర్లాండ్స్‌ తరపున 33 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతడు.. వరుసగా 1541, 533 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లో 88 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో టెన్‌ డష్కాటే మరి కన్పించలేదు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)