Breaking News

సూపర్‌ సెంచరీతో సత్తా చాటిన రికెల్టన్‌

Published on Fri, 01/03/2025 - 18:58

కేప్‌టౌన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (Ryan Rickelton) సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రికెల్టన్‌ 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సల్మాన్‌ అఘా బౌలింగ్‌లో బౌండరీ బాది రికెల్టన్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. 

టెస్ట్‌ల్లో రికెల్టన్‌కు ఇది రెండో సెంచరీ. మరోవైపు కెప్టెన్‌ టెంబా బవుమా కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమా 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ విరామం సమయానికి రికెల్టన్‌ (106), బవుమా (51) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ 17, వియాన్‌ ముల్దర్‌ 5, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 0 పరుగులకు ఔటయ్యారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అబ్బాస్‌, ఖుర్రమ్‌ షెహజాద్‌, సల్మాన్‌ అఘా తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, పాక్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211, రెండో ఇన్ని​ంగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు (8 వికెట్లు కోల్పోయి) చేసింది.

పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో కమ్రాన్‌ గులామ్‌ (54) అర్ద సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో డేన్‌ పీటర్సన్‌ 5, కార్బిన్‌ బాష్‌ 4 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (89), కార్బిన్‌ బాష్‌ (81 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌, నసీం షా తలో మూడు వికెట్లు తీశారు. 

పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (50), సౌద్‌ షకీల్‌ (84) అర్ద సెంచరీలు చేశారు. మార్కో జన్సెన్‌ 6 వికెట్లు తీసి పాక్‌ పతనాన్ని శాశించాడు. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడింది. మార్క్రమ్‌ (37), బవుమా (40),రబాడ (31 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి సౌతాఫ్రికాను గెలిపించారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు