Breaking News

గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌

Published on Wed, 12/03/2025 - 16:03

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్‌.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడు
రుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త వ‌న్డే జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వ‌న్డేలో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

దీంతో అత‌డిని రెండో వ‌న్డేకు ప‌క్క‌న పెట్టాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.

భారీ స్కోర్‌ దిశగా భారత్‌..
రాయ్‌పూర్‌ వన్డేలో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(43), జడేజా(9) ఉన్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు