Breaking News

రుతురాజ్ సూప‌ర్ సెంచ‌రీ.. భారత్‌ ఘన విజయం

Published on Thu, 11/13/2025 - 21:06

రాజ్‌కోట్ వేదిక‌గా సౌతాఫ్రికా-ఎతో జ‌రిగిన తొలి అనధికారిక వ‌న్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూప‌ర్ సెంచరీతో చెల‌రేగాడు. 286 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గైక్వాడ్‌ వికెట్‌కు 64 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

వ‌రుస క్ర‌మంలో అభిషేక్ శ‌ర్మ‌, రియాన్ ప‌రాగ్ పెవిలియ‌న్‌కు చేరిన‌ప్ప‌టికి.. రుతురాజ్ మాత్రం త‌న ఏకాగ్ర‌త‌ను కోల్పోలేదు. ఈ మ‌హారాష్ట్ర బ్యాట‌ర్‌ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో త‌న 16వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. 

సౌతాఫ్రికా చిత్తు..
రుతురాజ్‌తో పాటు కెప్టెన్‌ తిలక్‌ వర్మ(39), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(37), నిషాంత్‌ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు  ప్రోటీస్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్‌ పోట్‌గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్‌గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.

అభిషేక్‌ ఫెయిల్‌..
కాగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్‌ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్‌ క్రికెటర్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)