Breaking News

సచిన్‌, ధోని, కోహ్లి, రోహిత్‌.. రుతురాజ్‌ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..!

Published on Mon, 06/19/2023 - 15:19

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌, నయా మిస్టర్‌ కూల్‌, ధోని శిష్యుడు రుతురాజ్‌ గైక్వాడ్‌ తన గురువు ధోని, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మల జాబితాలో చేరిపోయాడు. పై పేర్కొన్న నలుగురు దిగ్గజాలలా రుతురాజ్‌కు కూడా పాదాభివందనం చేసే ఫ్యాన్స్‌ దొరికారు. ఇలా అనడం కంటే రుతురాజ్‌ అభిమానుల పాదాభివందనం నోచుకునే స్థాయికి ఎదిగాడనడం కరెక్ట్‌ అవుతుందేమో.

ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)లో ఓ మ్యాచ్‌ సందర్భంగా ఓ ప్రేక్షకుడు (రుతురాజ్‌ వీరాభిమాని) మైదానంలోకి ప్రవేశించి, రుతురాజ్‌ కాళ్లను మొక్కాడు. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆర్మీ ఈ సీన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది.

ఎంపీఎల్‌-2023లో పునేరీ బప్పా ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌.. కొల్హాపూర్‌ టస్కర్స్‌తో జరిగిన ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులను ఎదుర్కొన్న రుతు.. 5 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 237.04 స్ట్రయిక్‌ రేట్‌తో 64 పరుగులు సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో పునేరీ బప్పా టీమ్‌.. కొల్హాపూర్‌ టస్కర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను మనువాడిన రుతురాజ్‌.. కొల్హాపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన భార్య జెర్సీ నంబర్‌తో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగానే అభిమాని రుతురాజ్‌కు పాదాభివందనం చేశాడు. 

ఇదిలా ఉంటే, రుతురాజ్‌ గైక్వాడ్‌ తన కామ్‌ బిహేవియర్‌ కారణంగా తరుచూ ఎంఎస్‌ ధోనితో పోల్చబడుతుంటాడు. అలాగే అతనికి ధోనిలా అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సురేశ్‌ రైనా లాంటి సీనియర్‌ క్రికెటర్‌ ప్రశంసించాడు. తాజాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విషయంలోనూ రుతురాజ్‌ తన గురువు బాటలో నడుస్తుండటంతో అభిమానులంతా ఇతన్ని ధోనితో పోలుస్తున్నారు. కొందరు రుతురాజ్‌ను టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)