Breaking News

మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!

Published on Mon, 07/20/2026 - 10:14

ఒక్క మ్యాచ్‌తో అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ కల చెదిరిపోయింది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో స్పెయిన్‌ చేతిలో అర్జెంటీనా 1-0 గోల్‌ తేడాతో ఓటమిపాలైంది. స్పెయిన్‌ స్టార్‌ టోరెస్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదనపు సమయంలో గోల్‌ కొట్టి అర్జెంటీనా హృదయం ముక్కలు చేశాడు.

ఇక వరల్డ్‌కప్‌-2026 ఫైనల్‌ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ అని మెస్సీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌తో ఫైనల్లో గోల్‌ కొట్టడంలో మెస్సీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో గోల్డెన్‌ బూట్‌ (అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డు) కూడా మెస్సీ కోల్పోయాడు. ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కెలియన్‌ ఎంబాపె ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఆసక్తికర చర్చ.. మెస్సీకి అదొక పీడకల
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. స్పెయిన్‌ విషయంలో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సాధించింది.. మెస్సీ మాత్రం సాధించలేకపోయాడంటూ సాకర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మెస్సీ కెరీర్‌లో స్పెయిన్‌తో మ్యాచ్‌ ఓ  పీడకలలా మిగిలిపోయింది. ఫైనల్లో మెస్సీతో పాటు అతడి జట్టులో ఒక్క సభ్యుడు కూడా గోల్‌ కొట్టలేక టైటిల్‌ను కోల్పోయారు.

ఒకే ఒక్కసారి
ఇక మెస్సీ ఇప్పటికి నాలుగుసార్లు స్పెయిన్‌తో మ్యాచ్‌ ఆడాడు. తాజా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మినహాయిస్తే.. మిగిలిన మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు. అయితే, ఈ నాలుగు సందర్భాల్లోనూ మెస్సీ స్పెయిన్‌పై కేవలం ఒకే ఒక్క గోల్‌ సాధించాడు. 2009లో స్పెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ గోల్‌ కొట్టాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-1 గోల్‌ తేడాతో గెలిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ మెస్సీ స్పెయిన్‌పై గోల్‌ కొట్టలేదు. కీలక ప్రపంచకప్‌ ఫైనల్లోనూ మరోసారి అతడి ఈ బలహీనత బయటపడింది.

మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!
ఇక రొనాల్డో విషయానికొస్తే.. ఈ పోర్చుగల్‌ స్టార్‌ స్పెయిన్‌తో పదకొండుసార్లు తలపడ్డాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా నాలుగు గోల్స్‌ సాధించాడు. వరల్డ్‌కప్‌-2018లో హ్యాట్రిక్‌తో మెరిసి 3-3తో మ్యాచ్‌ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2025 నేషన్స్‌ లీగ్‌ ఫైనల్లో స్పెయిన్‌- పోర్చుగల్‌ మ్యాచ్‌ 2-2తో డ్రా కాగా... రొనాల్డో పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌ కొట్టి తన జట్టును గెలిపించాడు.

అంతేకాదు.. ఈ మాజీ రియల్‌ మాడ్రిడ్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఆటగాడు యూరో 2004, వరల్డ్‌కప్‌ 2010, యూరో 2012.. ఫిఫా వరల్డ్‌కప్-2026 రౌండ్‌ ఆఫ్‌ 16లో కూడా స్పెయిన్‌తో తలపడ్డాడు. అయితే, ఆయా సందర్భాల్లో గోల్‌ మాత్రం కొట్టలేకపోయాడు.

తీరని కల
ఏదేమైనా.. సమకాలీన ఫుట్‌బాలర్లలో మెస్సీ- రొనాల్డో.. ఇద్దరూ ఎవరికివారే సాటి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. రొనాల్డో గెలవలేని వరల్డ్‌కప్‌ ట్రోఫీని.. మెస్సీ 2022లో సొంతం చేసుకున్నాడు. అయితే, స్పెయిన్‌ విషయంలో మాత్రం మెస్సీ కంటే రొనాల్డో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక మెస్సీకి వరల్డ్‌కప్‌ మెగా ఫైనల్లోనూ స్పెయిన్‌ ఒక పజిల్‌లా మిగిలిపోయింది. గోల్‌ కొట్టలేక.. ఓటమి బాధతో కన్నీళ్లతో మెస్సీ మైదానాన్ని వీడాడు.

చదవండి: స్పెయిన్‌ హీరో.. ఎవరీ టోరెస్‌?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)