Breaking News

ఏంటి సర్ఫరాజ్‌.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్‌ సీరియస్‌

Published on Mon, 02/26/2024 - 07:58

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో భారత్‌ నిలిచింది.  192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(24), యశస్వీ జైశ్వాల్‌ ఉన్నారు.

అంతకుముందు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు, జడేజా ఒక్క వికెట్‌ సాధించారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.  భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌పై రోహిత్‌ శర్మ కాస్త సీరియస్‌ అ‍య్యాడు. 

ఏమి జరిగిందంటే?
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌ వేసేందుకు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ మార్పులు చేస్తూ.. సర్ఫరాజ్‌ను సిల్లీ పాయింట్‌లో ఉండమని సూచించాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్‌ హెల్మట్‌ ధరించకుండానే సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేయడానికి సిద్దమయ్యాడు. 

దీంతో సర్ఫరాజ్‌పై కెప్టెన్ రోహిత్ సీరియస్ అయ్యాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకువచ్చి సర్ఫరాజ్‌కు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా సిల్లీ పాయింట్‌లో హెల్మెట్‌ లేకుండా ఫీల్డింగ్‌ చేయడం చాలా ప్రమాద కారం. ఎందుకంటే ఈ ఫీల్డింగ్‌ పొజిషన్‌ బ్యాటర్‌కు దగ్గరగా ఉంటుంది. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఇదే స్ధానంలో ఫీల్డింగ్‌ చేస్తూ సర్ఫరాజ్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)