Breaking News

‘కెప్టెన్సీకి రోహిత్‌ శర్మ గుడ్‌బై చెబుతాడు’

Published on Wed, 12/18/2024 - 13:50

గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ ఈ ముంబైకర్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ సేన వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.

వరుస వైఫల్యాలు
కివీస్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గానూ రోహిత్‌ విఫలమయ్యాడు. మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు 2, 52, 0, 8, 18, 11. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝులిపించలేకపోతున్నాడు. పెర్త్‌ టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్‌.. అడిలైడ్‌లో తేలిపోయాడు. ఈ పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో అతడు మొత్తంగా కేవలం తొమ్మిది (3, 6) పరుగులే చేశాడు.

ఇక కీలకమైన మూడో టెస్టులోనూ రోహిత్‌ శర్మ విఫలయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ కేవలం పది పరుగులే చేశాడు. కాగా ఆసీస్‌తో ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్‌గా కాకుండా ఆరోస్థానంలో రోహిత్‌ బ్యాటింగ్‌కు దిగడం గమనార్హం. దీంతో మిడిలార్డర్‌లో ఆడటం కూడా రోహిత్‌ ప్రదర్శనపై ప్రభావం పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. సారథిగా, బ్యాటర్‌గా వైఫల్యం చెందుతున్న రోహిత్‌ శర్మపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ రోహిత్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో రోహిత్‌ పరుగులు రాబట్టేందుకు కచ్చితంగా ప్రయత్నం చేస్తాడు.

అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్‌ శర్మ గుడ్‌బై!
ఒకవేళ అలా జరగనట్లయితే.. తనను తానుగా తప్పుకొంటాడు. అతడు నిస్వార్థ గుణం ఉన్న కెప్టెన్‌. జట్టుకు భారంగా ఉండాలని కోరుకోడు. భారత క్రికెట్‌ ప్రయోజనాల పట్ల అతడి అంకితభావం అమోఘం. కాబట్టి వచ్చే రెండు మ్యాచ్‌లలోనూ ఇదే పునరావృతం అయితే, కచ్చితంగా కెప్టెన్‌గా తప్పుకొంటాడు’’ అని సునిల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. తొలి టెస్టుకు జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యం వహించగా భారత్‌ 295 పరుగుల తేడాతో గెలిచింది. 

ఇక రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా తిరిగి రాగా.. ఆసీస్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. తదుపరి ఇరుజట్ల మధ్య మెల్‌బోర్న్‌, సిడ్నీ వేదికగా నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి.

చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)