Breaking News

ఆస్ట్రేలియా టూర్.. రోహిత్‌ శర్మ ఊహించని నిర్ణయం!?

Published on Thu, 08/21/2025 - 13:45

టీమిండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స్వ‌దేశంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగే అనాధికారిక మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్‌-ఎ త‌ర‌పున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఈ మూడు వ‌న్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబ‌ర్ 5 మ‌ధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. కాగా టెస్టులు, టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగ‌నున్నాడు. 

ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఐపీఎల్-2025 త‌ర్వాత క్రికెట్ దూరంగా ఉంటున్న హిట్‌మ్యాన్‌.. ఆసీస్‌-ఎతో జ‌రిగే అనాధికారిక సిరీస్‌ను స‌న్న‌హాకంగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేవ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్ర‌కారం.. రోహిత్ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు తెలుస్తోంది.

కాగా ఆస్ట్రేలియా టూర్ త‌ర్వాత రోహిత్ పూర్తిగా అంత‌ర్జాతీయ క్రికెట్ వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027ను దృష్టిలో పెట్టుకుని రోహిత్, కోహ్లి స్దానాల్లో యువ ఆటగాళ్లను సిద్దం చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా వన్డేల్లో తన స్ధానాన్ని కాపాడుకోవాలంటే విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడమని రోహిత్‌ను సెలక్టర్లు కోరనున్నట్లు సమాచారం. మరి రోహిత్ ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతాడో లేదో వేచి చూడాలి. అయితే ఆసియాకప్ ముగిసిన తర్వాత వన్డే జట్టు భవిష్యత్తు గురించి చర్చించడానికి సెలెక్టర్లు ముంబైలో సమావేశం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఒకవేళ రోహిత్ తన కెరీర్‌ను ముగిస్తే భారత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్‌ శర్మ చివరగా విజయ్‌ హాజారే ట్రోఫీ 2018లో ముంబై తరపున ఆడాడు.
చదవండి: Ajinkya Rahane: ఇక గుడ్‌ బై.. అజింక్య ర‌హానే సంచ‌ల‌న నిర్ణ‌యం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)